నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం (Munugode Assembly constituency )లో అధికార బీఆర్ఎస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బహిర్గతమైంది.మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో అధికార
బీఆర్ఎస్ పార్టీ
రెండు వర్గాలుగా విడిపోయి మంత్రి జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) జన్మదిన వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూపరాణి భర్త నారబోయిన రవి ముదిరాజ్ అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేయగా,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి( Banda Purushottam Reddy ) ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేశారు.దీనితో సాధారణ కార్యకర్తలు ఏ వేడుకల్లో పాల్గొనాలో అర్థంకాక అయోమయంలో పడగా,కొందరు ఎటు పోతే ఏం తంటోనని తిరిగి వచ్చిన దారినే ఇంటి బాట పట్టడం గమనార్హం.







