బహ్రెయిన్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండుగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణము లో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిధిగా నారా రోహిత్ మరియి గుమ్మడి గోపాల కృష్ణ ముఖ్య అతిధులు గా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

 Ntr Centenary Celebrations In Behrain Details, Ntr Centenary Celebrations ,behra-TeluguStop.com

ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో మొదలైంది.తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాధ్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమైన ఒక మహాపురుషుడు మరియు తర తరాలను తన్మయం చేయగల కారణజన్ముడు, చిరస్మరణీయుడు అని కొనియాడారు.

అలాగే నారా రోహిత్ గారు మరియు గుమ్మడి గోపాల కృష్ణ గారు తెలుగు దేశం ని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని మనం అందరం కలిసి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు.

మరియు తదితర ముఖ్యులు శ్రీ శివ కుమార్ గారు, శ్రీ హరిబాబు గారు, శ్రీ మురళీకృష్ణ గారు, శ్రీ రాజశేఖర్ గారు, శ్రీ గోపాల్ చౌదరి గారు మరియు అనేకమంది వక్తలు నేతలు ఎన్టీఆర్ గారిని, వారు తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడుతూ, ఎన్టీఆర్ ని ఒక గొప్ప నాయకుడుగా, గొప్ప కళాకారుడు గా తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడు గా వర్ణించారు.కార్యక్రమం ఆద్యంతం ఆట పాటలతో ఒక్కో పాత్ర సభికులు ఉత్సాహ పరిచింది.ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో ప్రవాసాంధ్రులు దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గున్నారు.

మహానాడు జ్ఞాపికగా కేక్ కట్ చేసి ముగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube