హైదరాబాద్ ఉప్పల్ లో టిడిపి మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ టిడిపి మినీ మహానాడు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నందమూరి సుహాసిని పాల్గొని ప్రారంభించారు.నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీనవర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి అందజేశారన్నారు.
ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనేవారని, కూడు, గూడు, గుడ్డ అనే నినాదాలతో ముందుకెల్లారన్నారు.ఆకలితో అలమటించే పేద ప్రజలకు రెండు రూపాయల బియ్యం, చేనేత వస్త్రాలు, గూడు లేని వారికి పక్క ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు.
మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు నందమూరి సుహాసిని.