నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆయన సాధించిన సక్సెస్ లు చాలా చాలా తక్కువ.ఎట్టకేలకు బింబిసార విజయం సాధించింది.
ఆ సినిమా తో దక్కిన క్రేజ్ తో వరుస సినిమా లు హిట్ చేసుకోవాలని కళ్యాణ్ రామ్ ఆశ పడితే వెంటనే అమిగోస్ తో పరాజయం ను మూట కట్టుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు డెవిల్ సినిమా( Devil movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ నెల చివర్లో విడుదల అవ్వబోతున్న డెవిల్ సినిమా ను ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారనే వార్తలు వస్తున్నాయి.మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బింబిసార సినిమా కూడా ఆ స్థాయి లో వసూళ్లు సాధించలేదు.మరి డెవిల్ ను ఏ ధైర్యంతో అంత బడ్జెట్ తో నిర్మించారు అంటే మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
మరీ ఎక్కువ బడ్జెట్ అయినా కూడా కళ్యాణ్ రామ్ టీమ్( Kalyan Ram ) చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.
కొందరు మాత్రం సినిమా బడ్జెట్ లో సగం ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక సినిమా విడుదల తర్వాత కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.కళ్యాణ్ రామ్ వంటి హీరో తో పాతిక కోట్ల కు మించి ఖర్చు చేస్తే కచ్చితంగా రిస్కీ ప్రాజెక్ట్ అనడం లో సందేహం లేదు.
సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 70 కోట్లు వసూళ్లు చేస్తే తప్ప బయ్యర్లు మరియు నిర్మాతలు మంచి లాభాలు దక్కించుకోవడం సాధ్యం.మరి ఆ స్థాయి లో వసూళ్ల ను ఈ సినిమా దక్కించుకుంటుందా అనేది ఆసక్తి గా మారింది.