నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri kalyan ram )హీరో గా వచ్చిన బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అయితే ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ వరుసగా విజయాలు సొంతం చేసుకుంటాడు అంటే అమిగోస్ తో నిరాశ పరిచాడు.
ఇప్పుడు డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ ఏడాది లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న చివరి సినిమా కళ్యాణ్ రామ్ దే అవ్వడం విశేషం.
ఈ సినిమా దర్శకుడు మధ్య లో వదిలేయడం తో నిర్మాత అయిన అభిషేక్ నామా పూర్తి చేశాడు.

సినిమా కు దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే గా టైటిల్ కార్డు లో అభిషేక్ నామా పేరు ఉంది.మొన్నటి వరకు సినిమా గురించి జనాల్లో పెద్దగా హైప్ లేదు.ఎలా ఉంటుందో.
సినిమా కళ్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.అలాంటి డెవిల్ కి ఒక్కసారిగా ఇండస్ట్రీ లో మరియు మీడియా సర్కిల్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
డెవిల్ సినిమా ను ఒక ఏరియా లో విడుదల చేసేందుకు గాను దిల్ రాజు ( Dil Raju )కొనుగోలు చేయడం జరిగింది.సినిమా ను చూసిన తర్వాతే దిల్ రాజు కొనుగోలుకు ముందుకు వచ్చాడట.

కంటెంట్ ఆయనకు నచ్చింది.అదుకే సినిమా ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డెవిల్ సినిమా ( Devil movie )యొక్క కంటెంట్ పై దిల్ రాజు ( Dil Raju )నమ్మకం వమ్ము అవ్వదు.అలా దిల్ రాజు నమ్మకం నిలిపితే మాత్రం కచ్చితంగా కళ్యాణ్ రామ్ కి ఓ హిట్ పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో డెవిల్ ఉన్నాడు.ఇటీవల బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కూడా కళ్యాణ్ రామ్ కనిపించి తన డెవిల్ సినిమా ను ప్రమోట్ చేసుకున్నాడు.
కనుక కంటెంట్ పై ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే సినిమా హిట్ ఖాయం అన్నట్లుగా అనిపిస్తోంది.