స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చీరాల సముద్ర తీరంలో కుటుంబసభ్యులతో కలిసి సందడి చేశారు.అక్కాబావలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరిల ఆహ్వానం మేరకు సంక్రాంతి పండుగ కు కుటుంబ సమేతంగా కారంచేడు వచ్చిన బాలయ్య మూడు రోజులుగా అక్కడే ఉన్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాలయ్య కుటుంబ సభ్యులందరితో కలిసి చీరాల లోని సముద్ర తీరానికి వచ్చారు.భార్య వసుంధర ను జీపు ఎక్కించుకొని తీరం వెంబడి కాసేపు సరదాగా తిరిగారు.