టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడు.అలాగే చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.
ప్రెసెంట్ నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ”ది గోస్ట్” సినిమా ఒకటి.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చెయ్యగా.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

కర్నూల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా.ఈ ఈవెంట్ లో ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కూడా పాల్గొన్నారు.మరి ఈ ఈవెంట్ లో చైతూ మాట్లాడుతూ.ఫస్ట్ టైం కర్నూల్ వచ్చానని.అది కూడా నాన్నతో కలిసి, అఖిల్ తో కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.వారంలో మూడు నాలుగు సార్లు అయినా నేను నాన్నను కలుస్తూ ఉంటాను.
ఆయన ఆ సమయంలో తన వర్క్ కు సంబందించిన విషయం గురించి కూడా మాట్లాడతారు.

కానీ ఈ సినిమా గురించి మాత్రం గత నాలుగైదు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు.ఇంతటి ఎగ్జైట్మెంట్ నేను నాన్న గారిలో ఎప్పుడు చూడలేదు.నేను కూడా సినిమా ఇంకా చూడలేదు.కానీ కంటెంట్ విషయంలో మాత్రం షాక్ అయ్యాను.బంగార్రాజు నుండి ఘోస్ట్ గా మారిన తీరుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటూ తెలిపాడు.దసరా కానుకగా 5న రాబోతున్న ఈ సినిమా ఎంత గ్రాండ్ హిట్ అవుతుందో చూడాలి.