గ్రాండ్ గా 'తండేల్' మూవీ లాంఛింగ్.. హాజరయ్యిన గెస్టులు వీరే!

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Naga Chaitanya Sai Pallavi Thandel Muhurtham Ceremony Details, Thandel, Naga Cha-TeluguStop.com

వరుస సినిమాలతో దూసుకుపోతున్న చైతూకు ఈ మధ్య ప్లాప్స్ ఎదురవడంతో రేసులో వెనుకబడి ఉన్నాడు.ఈ క్రమంలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు.

నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి( Sai Pallavi ) మరోసారి నటిస్తుంది.

ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో( Love Story ) సూపర్ హిట్ అందుకుంది.

దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.ఇదిలా ఉండగా మొన్న చైతూ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

ఈ సినిమాకు ‘తండేల్”( Thandel ) అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయగా ఇప్పుడు ఈ రోజు గ్రాండ్ గా ఈ సినిమాను లాంచ్ చేసారు.పెరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు.ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్,( Venkatesh ) నాగార్జున( Nagarjuna ) అతిథులుగా వచ్చి ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న చందు మొండేటి నాగ చైతన్యకు కూడా హిట్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ అయిపోవాలని చూస్తున్నాడు.టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ అంచనాలు పెట్టుకున్నారు.చూడాలి ఈ కాంబో ఎలా ఆకట్టుకుంటుందో.

https://youtu.be/zBmo3RqyvKI
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube