అక్కినేని నాగ చైతన్య( Akkineni Naga Chaitanya ) ఇటీవల కస్టడీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.
అంతకు ముందు ఆయన నటించిన సినిమా లు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.నాగ చైతన్య కెరీర్ చాలా డౌన్ లో ఉన్న ఈ సమయంలో అల్లు అరవింద్ సమర్పణ లో సినిమా చేసే అవకాశం రావడం జరిగింది.
అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ నాగ చైతన్య హీరోగా చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వం లో సాయి పల్లవి హీరోయిన్ గా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు.సాయి పల్లవి ఈ సినిమా కి హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ భావించి స్వయంగా అల్లు అవింద్( Allu Aravind ) ఆమె తో చర్చలు జరిపాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తెలుగు లో ఈ మధ్య కాలంలో నటించేందుకు ఆసక్తి చూపించని సాయి పల్లవి( Sai Pallavi ) కచ్చితంగా నటించాల్సిందే అంటూ అల్ల అరవింద్ అడగడం తో ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది.బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా కు అల్లు అరవింద్ సమర్పకుడు.అయినా కూడా అన్ని విషయాలు ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయం పక్కన పెడితే అల్లు అరవింద్ ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దాదాపుగా రూ.75 కోట్ల బడ్జెట్ తో నాగ చైతన్య , సాయి పల్లవి, చందు మొండేటి సినిమా ని నిర్మిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

చందు మొండేటి గత చిత్రం కార్తికేయ 2 సినిమా( Karthikeya 2 ) వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అందుకే ఈ సినిమా పై చాలా ఆశలు ఉన్నాయి.అందుకే అల్లు అరవింద్ రిస్క్ చేస్తున్నాడు అంటున్నారు.పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా ను రూపొందించేందుకు గాను చందు స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు.
రికార్డు ల వర్షం కురిపించే విధంగా సినిమా వసూళ్లు నమోదు అయితేనే అల్లు అరవింద్ కు లాభాల పంట పండబోతుంది.