నాగ చైతన్య ఇంతకు ముందులా కాదు.. ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

నాగ చైతన్య గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా బిజీగా ఇప్పుడు సినిమా లు చేస్తున్నాడు.ఒక వైపు లవ్‌ స్టోరీ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

 Naga Chaitanya Doing Back To Back Movies In Recent Times , Bangarraju, Flim New-TeluguStop.com

మరో వైపు బంగార్రాజు సినిమా ను నాన్న నాగార్జునతో కలిసి చేసి ఆ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.నాగార్జున తో కలిసి నటించినా కూడా ఆ సినిమా లో నాగ చైతన్య రోల్‌ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆ సినిమా నాగ చైతన్య దే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే నాగ చైతన్య హిందీ సినిమా లాల్‌ సింగ్ చద్దా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఇదే సమయంలో నాగ చైతన్య థ్యాంక్యూ సినిమా ను చేస్తున్నాడు.విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ మరో రెండు మూడు వారాల్లో ముగించే అవకాశాలు ఉన్నాయి.

Telugu Bangarraju, Love Story, Naga Chaitanya-Movie

ఇక వెబ్‌ సిరీస్ కోసం నాగ చైతన్య సిద్దం అవ్వాల్సి ఉంది.మార్చి లేదా ఏప్రిల్‌ లో అమెజాన్ కోసం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ లో నాగ చైతన్య కనిపించబోతున్నాడు.ఆ వెబ్‌ సిరీస్ మాత్రమే కాకుండా రెండు సినిమా లకు కూడా కమిట్‌ అయ్యాడు.ఆ సినిమా లు వచ్చే ఏడాది లో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.

మొత్తానికి నాగ చైతన్య చాలా బిజీగా ఉండటం తో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.విడాకులు తీసుకున్న తర్వాత సున్నితపు మనష్కుడు అయిన నాగ చైతన్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

సినిమా లకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటాడేమో అంటూ కొందరు ఊహించారు.కాని ఆయన చాలా మెచ్యూరిటీతో వ్యవహరించాడు.నాగ చైతన్య ఈ విషయంలో ఎక్కడ కూడా బరస్ట్‌ అవ్వకుండా ఇద్దరి నిర్ణయాల ప్రకారం విడి పోయేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఆ తర్వాత కెరీర్‌ పై ప్రభావం లేకుండా జాగ్రత్తలు పడుతున్నాడు.

మొత్తానికి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube