కాంగ్రెస్ అధిష్టానంతో కోమటిరెడ్డి గేమ్.. పక్కా ప్లాన్‌తోనే మోడీతో సమావేశం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  ప్రధాని నరేంద్ర మోదీతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.  కోమటిరెడ్డి భాజపాలో చేరనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అంత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

 Mp Komatireddy Venkatareddy Meets Pm Narendra Modi, Komatireddy Venkat Reddy,pm-TeluguStop.com

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. కొత్త కార్యవర్గంలో తన పేరు కనిపించకుండా పోవడంతో ఆయనకు గట్టి షాక్ తగిలింది.

 వెంటనే కోమటిరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై పార్టీ అంతర్గత విషయాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం కోమటిరెడ్డి చల్లబడ్డారని, త్వరలోనే ఆయన టీ-కాంగ్రెస్‌ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారని కొందరు అంటున్నారు.

అయితే ఈ భేటి అంత మర్యాదపూర్వకంగా జరగలేదని తెలుస్తుంది.  అధిష్టానానికి  కోమటిరెడ్డి కొన్ని షరుతలు పెట్టినట్లుగా సమాచారం.

ముఖ్యంగా రేవంత్‌ను టీపీసీసీ అధక్ష పదవి నుండి తప్పించాలని కొరినట్లుగా తెలుస్తుంది.తన అనుచురల భేటీలో అధిష్టానం తన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్ని షాన్ ఇవ్వాలని అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.

అందులో భాగంగానే మోడీ భేటీ జరిగినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu Congress, Komativenkat, Rajagopal Reddy, Revanth Reddy, Tpcc-Politics

అయితే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోమటిరెడ్డి ఇంకా పనిచేసే మూడ్‌లో లేరన్నది వాస్తవం. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రేవంత్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇంకా కోమటిరెడ్డి కోరుకున్న టీ-పీసీసీ చీఫ్ రోల్ తనకు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీ-పీసీసీ పాత్ర కోసం ఓపికగా ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి తన భవిష్యత్తు గురించి కూడా తన ఆప్షన్‌లను ఓపెన్‌గా ఉంచుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించి ఉంటే.

వెంకట్ రెడ్డి ఈపాటికి బీజేపీలో చేరి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత వెంకట్‌రెడ్డిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి వైదొలగడంపై స్పష్టత వస్తుందని చెప్పారు.

కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించేందుకే ప్రధాని మోదీని కలుస్తున్నారని టీ-కాంగ్రెస్ చెబుతోంది. “ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిని లేదా ఇతర కేంద్ర మంత్రులను కలవవచ్చు.

 అందులో తప్పేమీ లేదు’’ అని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube