కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైరయ్యారు.కాంగ్రెస్ నిర్ణయాన్ని వెంకటరెడ్డి వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు,, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కార్యకర్తల సైతం నిరసన తెలుపుతున్నారని అన్నారు.
శివన్న గూడెం భూ నిర్వాసితులకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా మునుగోడులో పాల్వాయి స్రవంతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ స్రవంతి పోరాడుతారని స్పష్టం చేశారు.