ఇలాంటి వింత ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.బేసిగ్గా ఓ వాహనదారుడు ట్రాఫిక్ చర్యలు ఉల్లంఘినందుకుగాను కిక్కురుమనకుండా చలానా చెల్లించేస్తాడు.
ఈ విషయంలో ఎవరు ట్రాఫిక్ పోలీసులకు ఎదురు ప్రశ్నలు వెయ్యరు.కానీ హెల్మెట్ లేకుండా బైకు నడిపినందుకు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి అక్కడి ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.
ఆ చలానాతో పోలీసులు అటాచ్ చేసిన ఫొటోలో అతని స్కూటీ, స్కూటీ నంబర్ మాత్రమే కనిపించగా, అతను తలకు హెల్మెట్ ధరించాడా? లేదా? అనేది ఆ ఫొటోలో స్పష్టంగా కనిపించడంలేదు.దాంతో అతను.
తాను హెల్మెట్ ధరించలేదనడానికి ప్రూఫ్ కావాలని బెంగళూరు పోలీసులను సవాల్ చేశాడు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి.
ఆ సదరు యువకుడు గతంలో ఇలా చలానా వేస్తే ప్రశ్నించకుండా చెల్లించాడట.ఇపుడు మాత్రం అలాంటిది లేదని, తాను హెల్మెట్ ధరించనట్లుగా ప్రూఫ్ చూపిస్తే తప్ప ఇపుడు చలానే కట్టేది లేదని ఒంటికాలితో శపధం చేసాడట.
అక్కడితో ఆగకుండా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు, బెంగళూరు సిటీ పోలీసులకు ట్వీట్ రూపంలో తన అభిప్రాయాన్ని తెలియ చేశాడు.
కాగా ఈ ట్వీట్‌పై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు.
అతని సవాలని స్వీకరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ప్రూఫ్ చూపించి అతగాడికి ఝలక్ ఇచ్చారు.అతను హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్నట్లుగా ఉన్న ఫుల్ ఫొటోను చలానాకు జత చేశారు.
దాంతో బైకర్ ఖంగు తిన్నాడు.వెంటనే రిప్లై ఇచ్చిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ క్షమాపణలు చెబుతూ… చలానా ఖచ్చితముగా కడుతానని పేర్కొన్నాడు.
కాబట్టి ఇలాంటి సవాళ్లు చేయకండి బాబులూ… సీసీ కెమెరాలు మన చుట్టూ ఉంటాయి మరి!
.