మంచు విష్ణు కి టాలీవుడ్ ప్రేక్షకులు మరో సారి షాక్ ఇచ్చారు, 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన మోసగాళ్లు సినిమా కు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ ఇవ్వకుండా గతం లో షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు ఈసారి జిన్నా సినిమా కు కనీసం మొదటి రోజు పాతిక లక్షల కలెక్షన్స్ ఇవ్వకుండా అతి పెద్ద షాక్ ఇచ్చారు. మంచు విష్ణు ఈ దెబ్బ తో సినిమా లు మానేస్తాడు అంటూ కొందరు సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్స్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున సినిమా ను నిర్మించి ప్రమోషన్ చేసి సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్ లో సినిమా ను విడుదల చేసిన మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.సినిమా విడుదల కాకుండానే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అంటూ చాలా మంది పై తీవ్ర విమర్శలు చేసిన మంచు విష్ణు సినిమా విడుదలైన తర్వాత వస్తున్న విమర్శలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
అమెరికా తో పాటు ఇతర ఏరియాల్లో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ నెంబర్స్ చెబితే ఒక తెలుగు సినిమా మరీ ఇంత దారుణంగా కలెక్షన్స్ నమోదు చేస్తుందా అంటూ నమ్మ లేకుండా జనాలు ఉన్నారు.

మంచు విష్ణు స్థితి మరీ ఇంతకు దిగజారి పోయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ జాలి చూపిస్తున్నారు.డబ్బింగ్ సినిమాలైనా ఇంతకు మించి వసూళ్లు చేస్తాయి కదా స్వామి అంటూ మంచు విష్ణు ని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ సినిమా ను మళ్ళీ ఏకీపారేస్తూ పెద్ద ఎత్తున యాంటీ మంచు ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
మంచు విష్ణు ఇకనైనా సినిమా ల ఎంపిక విషయం లో జాగ్రత్త వహించాలంటూ ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు.







