గన్మెన్ల తొలగింపుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరు గన్మెన్లను తొలగించారన్న కోటంరెడ్డి మిగిలిన ఇద్దరు గన్మెన్లు కూడా నాకొద్దని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా గన్మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.