పెద్ద గుమ్మడికాయలతో పాపులర్: ఒకే రోజు రెండు రికార్డులు సృష్టించిన మిస్సోరీ వ్యక్తి

సాధారణంగా గుమ్మడికాయలు బరువెంత ఉంటాయి.మహా అయితే మినిమమ్ పది కేజీలు, మ్యాగ్జిమమ్ 15 కేజీలు అయితే అమెరికాలో ఓ వ్యక్తి 1,650 కిలోల గుమ్మడికాయను పండించాడు.

 Missouri Man Breakshis Own State Record Twice With Pumpkins-TeluguStop.com

దీనికే జనం ఆహా.ఓహో అంటుంటే ఆ కొద్దిసేపటికే 1,650 కేజీల గుమ్మడికాయను ప్రదర్శించి ఒకే రోజులో రెండు రికార్డులు అధిగమించాడు.వివరాల్లోకి వెళితే.మిస్సోరి రాష్ట్రంలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు చెందిన రిచర్డ్ బాటోర్ఫ్ అక్టోబర్ 5న రిపబ్లిక్ పమ్‌కిన్ డేజ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు.

తొలుత అతను ప్రదర్శించిన గుమ్మడికాయ 1,677 కేజీలు తూగింది.ఆ తర్వాత మరో 25 నిమిషాల అనంతరం ప్రదర్శించిన రెండో గుమ్మడికాయ 1,798 కేజీలు తూగడంతో అక్కడున్న పర్యాటకులు ఆశ్చర్యపోయారు.

ఈ రెండింటిని తరలించడానికి నిర్వాహకులకు భారీ క్రేన్ కావాల్సి వచ్చింది.రెండవ గుమ్మడికాయ మొదటి దానికంటే 121 పౌండ్లు ఎక్కువగా.16 అడుగులు వెడల్పు ఉంది.బాటోర్ఫ్ ఈ విధంగా ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్సోరి స్టేట్ పమ్‌కిన్ పోటీల్లో రికార్డు నెలకొల్పాడు.

తొలిసారిగా 2005లో తొలిసారి ఈ ఫెస్టివల్‌లో విజయం సాధించాడు.

Telugu Pound Pumpkins, Missouri Breaks, Size Pumpkin, Telugu Nri Ups-

విత్తన జన్యుశాస్త్రంలో పరిశోధనలతో పాటు ప్రకృతిపరంగా నడుచుకోవడం ద్వారానే తాను ఈ ఘనతను అందుకోగలిగానని బాటోర్ఫ్ వివరించాడు.రెండు గుమ్మడికాయలలో ఒకదానిని లాంతర్‌గా మలచగా.మరో దానిని పాఠశాలల్లో ప్రదర్శనకు ఉంచారు.

కాగా రెండవ గుమ్మడికాయ ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో 56వదిగా స్థానం దక్కించుకుంది.మిస్సోరీలోని వేడి వాతావరణం, అధిక తేమ గుమ్మడికాయల ఎదుగుదలను దెబ్బతీస్తాయని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే పెద్ద గుమ్మడికాయలను పెంచడానికి అమెరికాలోని ఉత్తమమైన ప్రదేశం పసిఫిక్ వాయువ్య ప్రాంతంలో ఉంది.ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద గుమ్మడికాయను బెల్జియంలో పండించారు.2,624 పౌండ్ల బరువుతో అది 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube