ఒక వైపు బీజేపీ మరియు శివసేన పార్టీల మద్య అధికారం పంచుకునే విషయంలో చర్చలు జరగాల్సిందే అంటూ శివసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.శివసేన మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వంను ఏర్పాటు చేయలేదు.
మరో 40 ఎమ్మెల్యేలు ఉంటేనే బీజేపీకి మళ్లీ అధికారం దక్కే అవకాశం ఉంది.కాని ఇప్పుడు బీజేపీతో పాటు మాకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో శివసేన పార్టీ నాయకులు కొందరు బీజేపీతో దగ్గర అయ్యేందుకు సిద్దంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
బీజేపీ ఇంకా సరైన మద్దతును కూడగట్టడంలో సక్సెస్ కాలేదు.
అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అయ్యింది.పడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు పడ్నవీస్‌ను శాసనసభ పక్ష నేతగా పడ్నవీస్‌ను ఎంపిక చేసింది.దాంతో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.
లాజికల్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బల ప్రదర్శణకు సిద్దం అవ్వాల్సి ఉంటుంది.అప్పటి వరకు ఏమైనా అద్బుతం జరుగుతుందేమో అని బీజేపీ ఆశపడుతోంది.
కాని శివసేన పార్టీ నాయకులు మాత్రం చాలా బలంగా ఉన్నారు.సీఎం పదవిని తమకు రెండున్నర సంవత్సరాలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.







