‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కేసరపల్లి బైపాస్ వద్ద నైట్ స్టే పాయింట్ నుంచి మాజీ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ కేశినేని నాని ప్రెస్‌మీట్: జగన్ గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు చేయించిన హత్యాయత్నం ఇది.ఆయన్ను ఏదో ఒక విధంగా అంతమొందించాలని ఇది చంద్రబాబు చేసిన కుట్ర.
ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి గారి వెంట ఉన్నారనే చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపాడు.ఈ కుట్రకు కారణం చంద్రబాబే.
తన తొత్తులతోనే ఇది చేయించాడు.గతంలో ఇలాగే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహనరంగా గారిని హత్య చేశాడు.
ఇలాంటి హత్యారాజకీయాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్.
ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే భావిస్తున్నాను.టార్గెటెడ్‌గా చేయకపోతే ఇది జరగదు.తప్పనిసరిగా దీనిలో ఏదో కుట్ర దాగి ఉంది.ఇది తీవ్రమైన చర్య.
ఇక్కడే కాదు.మేం ఢిల్లీలో కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.
సీఎం గారికి సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వాలని మేం కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: విజయవాడ ఎంపీ కేశినేని నాని.
కేశినేని నాని: ప్రజల్లో అపూర్వమైన స్పందన వచ్చింది.జరిగిన సంఘటనపై పోలీసు వారు విచారణ చేయాలి.వెంటనే ఎన్నికల కమిషన్ కూడా స్పందించి దీనిపై నిజాలను నిగ్గు తేల్చాలి.ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేసి సరైన రీతిలో స్పందించాలి.ఎవరు చేసినా ఇది తప్పు.
పోలీసులు విచారణ చేసి ఎవరు చేశారో చెప్పాలి.నాకు తెలిసి ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను.
ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్ గారిని అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరు.ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ గారు గతంలో కంటే ఎక్కువ సీట్లతో ప్రభుత్వాన్ని ఫాం చేస్తారు.
ఇటువంటి కుట్రలు, కుటిల రాజకీయాలు ఆపితే మంచిందని నేను చెప్తున్నా.ముందు పోలీసు విచారణ వెంటనే జరగాలి.
ఇది చాలా తీవ్రమైన పరిణామం.టార్గెటెడ్‌గా చేయకపోతే ఇది జరగదు.
తప్పనిసరిగా దీనిలో ఏదో కుట్ర దాగిఉంది.
లోకేశ్ 600 మందిని హైర్ చేసుకుని కేవలం సోషల్ మీడియాపైనే బతుకుతున్నాడు.
అతను ఎవరిమీదైనా దుష్ప్రచారం చేయిస్తాడు.అతను అలా అలవాటు పడిపోయాడు.
ఇది తీవ్రమైన చర్య.ఇక్కడే కాదు.
మేం ఢిల్లీలో కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.సీఎం గారికి సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వాలని మేం కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.
మమ్మల్ని ఎదుర్కోలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనడంలో సందేహం ఏమీ లేదు.జగన్ గారి ప్రజాదరణను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా విజయవాడలో ఈ తీరు విపరీతంగా ఉంది.ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ పెంచాలి.
ఆయన భద్రతకు టాప్ మోస్ట్ ప్రయారీ ఉండాలి.చాలా కట్ అయింది.
సీఎం గారు చాలా విలవిలలాడారు.అయినా ఆయన ఓర్చుకుని యాత్ర కంటిన్యూ చేశారు.
వెలంపల్లి శ్రీనివాస్: వైఎస్ జగన్ గారి మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతం కావడం, లక్షలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చిన ఆయనకు దీవెనలు ఇచ్చిన తీరు చూశాం.చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో చంద్రబాబు, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేక ఈ దాడికి దిగారు.
వారు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వారి వెంట లేరని తెలిసి ముఖ్యమంత్రి గారిపై హత్యా యత్నం చేశారు.ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద దెబ్బ తగిలింది.
బ్లడ్ కారుతోంది.పక్కనే ఉన్న నా కంటికి కూడా తగిలింది.
ఇది చాలా దుర్మార్గం.చంద్రబాబునాయుడికి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరిన దుర్మార్గుడు చంద్రబాబు.
జగన్ గారి ప్రభంజనం చూడలేక ఏదో ఒక విధంగా అంతమెందించాలనే కుట్రతోనే ఇది చేశారు.చంద్రబాబు దుర్మార్గంగా తన తొత్తులతో చేయించిన దుశ్చర్య ఇది.చంద్రబాబు కుట్ర చేసినా జగన్ గారు అంత దెబ్బ తగిలినా మళ్లీ పైకెళ్లి ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేసిన వ్యక్తి.అటువంటి వ్యక్తి రక్తం కళ్లచూశాడు చంద్రబాబు.
చంద్రబాబు ఇటువంటి హత్యారాజకీయాలకు తెరలేపాడు.గతంలో ఇలాగే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహనరంగా గారిని హత్య చేశాడు.
విజయవాడలో ఇలాంటి కుట్రలు చంద్రబాబు ఎన్నో చేశాడు.కరెంట్ లేని సమయంలో కావాలని చేసిన కుట్ర ఇది.
ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది.జగన్ గారికి ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు నీ నీచపు కుట్రలు ఇప్పటికైనా ఆపు.ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం.చంద్రబాబు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు.ఇప్పటి వరకూ పది సర్వేలకు పైగా వచ్చాయి.జగన్ గారు స్వీప్ చేయబోతున్నారని చెప్తున్నాయి.ఆయన్ను ఏదో ఒక విధంగా అంతమొందించాలని ఇది చంద్రబాబు చేసిన కుట్ర.
ఇలాంటి హత్యారాజకీయాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేయాలని పార్టీలను కలుపుకుని వచ్చాడు.
ప్రజలు నమ్మలేదు.ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి గారి వెంట ఉన్నారు.
– అందుకే చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపాడు.ఈ కుట్రకు కారణం చంద్రబాబే.
తన తొత్తులతోనే ఇది చేయించాడు.