టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకి సిగ్గు రాలేదని మంత్రి మేరుగ విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆ పేద ప్రజలే తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.