ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల చేశారు.కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

 Minister Botsa Satyanarayana Released Ap Inter Exam Results, Minister Botsa Sat-TeluguStop.com

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ పరీక్షల్లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.ఫలితాల్లో బాలికలదే పైచేయి( Girls ) పేర్కొన్నారు.

ఇంకా జిల్లాల పరంగా కృష్ణాజిల్లా టాప్ ప్లేస్ లో నిలిచిందని విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.

ఇంటర్ మొదటి సంవత్సరం 4,84,197 మంది, సెకండ్ ఇయర్ 5,19,793 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాలు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు రేపటి నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు అవకాశం ఉంటుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు.సప్లమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి మే మూడవ తారీకు వరకు ఫీజు కట్టోచ్చని పేర్కొన్నారు.

మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.జూన్ 5 నుంచి 9 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube