ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..!!
TeluguStop.com
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల చేశారు.
కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ పరీక్షల్లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఫలితాల్లో బాలికలదే పైచేయి( Girls ) పేర్కొన్నారు.ఇంకా జిల్లాల పరంగా కృష్ణాజిల్లా టాప్ ప్లేస్ లో నిలిచిందని విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం 4,84,197 మంది, సెకండ్ ఇయర్ 5,19,793 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాలు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు రేపటి నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు అవకాశం ఉంటుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
సప్లమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి మే మూడవ తారీకు వరకు ఫీజు కట్టోచ్చని పేర్కొన్నారు.
మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
జూన్ 5 నుంచి 9 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్