యూఏఈ ఈ మధ్య కాలంలో ఎంతో మంది భారతీయులకు గోల్డ్ వీసాలు అందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.తమ దేశానికి విశిష్టమైన సేవలు అందించిన భారతీయుల పట్ల గౌరవాన్ని చూపిస్తోంది.
అలాగే ఎంతో మంది ప్రముఖులకు తమ దేశపు అత్యున్నత వీసా అయిన గోల్డెన్ వీసాను అందిస్తూ అరుదైన గౌరవాన్ని అందిస్తోంది.ఇప్పటి వరకూ యూఏఈ అందించిన గోల్డెన్ వీసాను అందిపుచ్చుకున్న వారిలో బాలీవుడ్ ప్రముఖులు, ప్రఖ్యాత గాయనీ మణులు ఉండగా క్రికెటర్స్ కు కూడా తమ గోల్డె వీసాను అందించి సత్కరించింది.
ఈ క్రమంలోనే ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు, మిల్కా సింగ్ కు యూఏఈ అరుదైన గోల్డెన్ వీసాను అందించింది వివరాలలోకి వెళ్తే.
మిల్కా సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని గోల్ఫ్ ఆటగాడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
భారతీయుడిగా పుట్టిన మిల్కా సింగ్ తన ఆటపై మరింత పట్టు సాధించేందుకు, గోల్ఫ్ సాధన కోసం 1993 లో భారత్ ను వీడి దుబాయ్ లో స్థిరపడిపోయారు.ఆ తరువాత గోల్ఫ్ లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు 10ఏళ్ళ గోల్డెన్ వీసాతో సత్కరించింది.
భారత ప్రముఖ గోల్ఫర్ గా, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీతగా ఎంతో గుర్తింపు ఉన్న మిల్కా సింగ్ ఎన్నో ప్రపంచ టోర్నీలలో తన సత్తా చాటారు.

2001 లో దుబాయ్ లో ఏర్పాటు చేసిన దుబాయ్ డిసేర్ట్ క్లాసిక్ లో ప్రపంచ రికార్డ్ నమోదు చేశారు.ఇప్పటి వరకూ యూరోపియన్, జపాన్, ఏషియన్ టూర్, లలో ఆరు టైటిల్స్ సాధించారు.అయితే దుబాయ్ ఇచ్చిన గోల్డెన్ వీసా పై స్పందించిన మిల్కా సింగ్ తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, తన కుటుంభ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారని, గోల్ఫ్ కోర్సులలో నాణ్యమైన, నైపుణ్యమైన విద్య కోసం ఏర్పాటు చేస్తున్న వసతుల అబ్బురపరుస్తున్నాయని మిల్కా సింగ్ అంటున్నారు