మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా( Michelle Obama ) యూఎస్‌లో రాబోయే ఎన్నికల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ముఖ్యంగా తన భయాలను పంచుకున్నారు.
ఎన్నికలలో ఏం జరుగుతుందోనని తాను భయపడిపోతున్నానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.సోమవారం నాడు జే శెట్టి తన పోడ్‌కాస్ట్ “ఆన్ పర్పస్”లో ఆమెను ఇంటర్వ్యూ చేశారు.
ఇందులో మాట్లాడుతూ మనం ఎంచుకునే నాయకులు చాలా ముఖ్యమని ఆమె అన్నారు.నాయకులే ప్రజల కోసం మాట్లాడతారు, జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని( Democracy ) మనం సింపుల్ గా తీసుకోకూడదని మిచెల్ అందరికీ సలహా ఇచ్చారు.సమాజం బాగుపడడానికి మంచి ప్రభుత్వం, ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమని ఆమె ఉద్ఘాటించారు.
ప్రభుత్వం తమకు ఏమీ చేయదని కొందరు అనుకుంటున్నారని, నిజానికి ప్రభుత్వం మన కోసం అన్నీ చేస్తుందని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యం విలువను మరువకూడదని అన్నారు.

తనను ఇబ్బంది పెట్టే ఇతర విషయాల గురించి కూడా ఆమె మాట్లాడారు.ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు, సంఘర్షణలు, విద్యా వ్యవస్థ, కృత్రిమ మేధస్సు భవిష్యత్తు గురించి ఆమె మాట్లాడారు.ఈ విషయాలు తనను కూడా నిలబెట్టాయని చెప్పారు.ప్రజలు తమ ఫోన్లకు బానిసలుగా ఉన్నారా.వారు ఓటు వేయడం గురించి తగినంత శ్రద్ధ వహిస్తారా? అని కూడా ఆమె సందేహం వ్యక్తం చేశారు.

జాత్యహంకారం, అజ్ఞానం తనకు నచ్చవని, తాను ఎప్పుడూ వీటిని అసహ్యించుకుంటూనే ఉన్నానని చెప్పారు.అన్యాయాన్ని, వేధింపులను తాను ద్వేషిస్తానని, అయితే తను చెప్పే విషయాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు.ట్రంప్( Donald Trump )పై మిచెల్ పరోక్షంగా విమర్శలు చేశారు.
అతని నాయకత్వం “చైల్డిష్” అని ఆమె అన్నారు.మనం కమ్యూనికేట్ చేసే విధానం ముఖ్యం అని, మనసులో ఉన్న ఏది పడితే అది బయటకు వాగకూడదని ఆమె అన్నారు.
ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలుస్తారేమోనని తాను భయపడుతున్నట్లు కూడా చెప్పారు.