బెండ పంటను ఆశించే కోవనేఫోరా ఎండు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

కూరగాయ పంటలలో ఒకటైన బెండ పంటకు( Okra ) చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.సకాలంలో వీటిని గుర్తించి సస్య సంరక్షక చర్యలు చేపట్టకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

 Methods Of Controlling Covanephora Dry Pests Of Okra Crop Details, Okra, Covanep-TeluguStop.com

బెండ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో కోవనేఫోరా ఎండు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగులను గుర్తించి నివారించడంలో ఆలస్యం జరిగితే దిగుబడి సగానికి పైగా తగ్గడంతో పాటు పండిన పంట కూడా నాణ్యత లేకుండా ఉంటుంది.

ఈ తెగుళ్లు ఒక ఫంగస్( Fungus ) వల్ల బెండ పంటను ఆశిస్తాయి.కీటకాలు, పనిముట్లు, గాలి, నీరు లాంటి వాటి వల్ల ఈ తెగుళ్ల వ్యాప్తి విస్తృతంగా పెరుగుతుంది.

సుదీర్ఘకాలం వర్షాలు కురిసిన, పొలంలో అధిక తేమ లేదా అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ఈ తెగుళ్ల వ్యాప్తి పెరుగుతుంది.

Telugu Covanephora Dry, Fungus, Finger Crop, Okra, Okra Crop, Okra Diseases-Late

బెండ మొక్క( Okra Plant ) పువ్వులు, పూమొగ్గలు వాలిపోయి ఎండిపోతాయి.నీటిలో నానినట్టు ఉండే మచ్చలు మొక్కలపై గమనించవచ్చు.ఇలాంటి మొక్కలు కనిపించిన వెంటనే వాటిని పీకేసి నాశనం చేసేయాలి.

పొలం చుట్టూ వివిధ రకాల కలుపు మొక్కలను( Weeds ) మొత్తం తొలగించి లక్షణం చేయాలి.బెండ మొక్కలకు పైనుండి నీటిని పెట్టకూడదు.బెండ మొక్కలు ఎప్పుడు తేమతో లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి.

Telugu Covanephora Dry, Fungus, Finger Crop, Okra, Okra Crop, Okra Diseases-Late

ఒకేసారి అధిక మోతాదులో రసాయన ఎరువులను ఉపయోగించరాదు.మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.

పొలంలో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి.ఈ తెగులను పొలంలో గుర్తించిన తర్వాత వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకొని పిచికారి మందులను ఉపయోగించి తొలి దశలోనే నివారిస్తే.

మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube