సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు తమకు అవకాశాలు లేకపోవడంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.అంటే కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం కానీ లేదా మరేదైనా షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తుంటారు.
అయితే గత కొన్ని రోజుల నుండి మెహరీన్ ఫిర్జాదాకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి.దీంతో అవకాశాలు ఎక్కువగా రాకపోయేసరికి ఈ బ్యూటీ ఓ నిర్ణయం తీసుకుంది.
ఇంతకు అదేంటంటే.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్( Mehreen firzada ) అందరికీ బాగా పరిచయమని చెప్పాలి.
చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.మెహరీన్ తొలిసారిగా నాచురల్ స్టార్ హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ( Krishnagadi Veera Prema Gaadha ) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఈ సినిమాలో తన నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం వరుసగా రావటంతో.అలా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో బాగా ఎనర్జీగా కనిపించడంతో.
నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన సినిమాల అప్డేట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేస్తుంది.అప్పుడప్పుడు తను చేసే విన్యాసాల వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.
తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తుంది.అయితే కొత్త హీరోయిన్స్ రాకతో ఈ బ్యూటీకి సినిమాలలో అవకాశాలు చాలా తగ్గాయి.
అంటే ఏడాదికి ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రావట్లేదు.దీంతో తనకు కూడా అవకాశాలు రావట్లేదని అర్థం అవ్వటంతో ఆ అవకాశాలు వచ్చే గ్యాపులో ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఫ్యామిలీతో ఏదో ఒంటరిగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంది.మామూలుగా ఈ బ్యూటీ సోషల్ మీడియా( Social media )లో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ప్రతి ఒక విషయాన్ని ప్రతి రోజు పంచుకుంటూ ఉంటుంది.అటువంటిది సినిమాలు లేకపోయేసరికి ఖాళీగా ఉండటం తట్టుకోలేక బయట సమయాన్ని గడుపుతుంది.
అయితే రీసెంట్ గా ఒక సినిమాకు సైన్ చేసినట్లు తెలిసింది.కానీ ఆ సినిమా గురించి పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికి బయటకు రాలేదు.ఇక మెహరీన్ కూడా ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వటం లేదు.
అయితే అవకాశాలు లేకపోవడంతోని తను ఖాళీగా ఉండకుండా విదేశాలు తిరుగుతుందని అర్థమవుతుంది.అయితే ప్రస్తుతం తను మరో ట్రిప్పులో ఉన్నట్లు కనిపించగా దానికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.