టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇకపోతే తాజాగా సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైన విషయం తెలిసిందె.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించాడు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు చిరు.కాగా ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమా భోళా శంకర్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అయితే మెగాస్టార్ నటిస్తున్న ఈ భోళా శంకర్ సినిమా తాజా షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది.
హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది.
ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజా షెడ్యూల్లో భాగంగా కీర్తి సురేష్ కూడా పాల్గొంది.ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.
వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని చిరంజీవి ఈ సినిమాతో ఏ మేరకు సక్సెస్ అందుకుంటారు చూడాలి మరి.