బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అబద్ధాలు చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.కనీసం 8 లేదా 9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
కరెంట్ కోసం రైతులు సబ్ స్టేషన్ ల ముందు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ కోతలపై శాసనమండలిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.







