ఏపీ రాజధాని అమరావతి విషయం హాట్ టాపిక్ గా రాజకీయ వర్గాల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే.మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై పై మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను లేఖ రూపంలో విడుదల చేశారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఈ విషయంలో జగన్ కు తాను మద్దతు పలుకుతున్నా అంటూ చిరంజీవి లేఖ విడుదల చేశారు.అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో మరో లేక ప్రత్యక్షమైంది.
‘ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానిలో ఏర్పాటును సమర్థిస్తూ గాని వ్యతిరేకిస్తూ గాని నేను ఏ విధమైన ప్రకటన చేయలేదు.తెలుగు ప్రజలకు చేరువ చేసి నన్ను ఇంతవాడిని చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది.
దయచేసి గమనించగలరు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినట్టుగా ఓ ప్రకటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

రాజధానులను సమర్పించినట్లుగా శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ఆదివారం ( 22 12 2019 ) తేదీన వచ్చిన ప్రకటన అవాస్తవం అంటూ ఆయన మీడియాకు తెలియజేశారు.మూడు రాజధానులను ఏపీలో ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన మరోసారి క్లారిటీ ఇవ్వడంతో చిరు లేఖపై గందరగోళం సమిసిపోయింది.అయితే ఇదంతా జనసేన పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు చిరు ఫేక్ లెటర్ సృష్టించారనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి.