ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) .రెబెల్ నేత అని అందరికీ తెలుసు.
దెందులూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని 2019 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.ఈ క్రమంలో చింతమనేని పై వైసీపీ( YCP ) అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి గెలుపొందారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలను వైసీపీ.అదేవిధంగా టీడీపీ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గం లో కొఠారి వర్సెస్ చింతమనేని అన్నట్టు పరిస్థితి మారింది.
నిన్న రోడ్లు పనుల విషయంలో రెండు పార్టీల నేతలు గొడవకు దిగటం తెలిసిందే.రోడ్లు పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి మెటల్ రాళ్లు వాడాల్సిన చోట తక్కువ క్వాలిటీ రాళ్లు వాడుతున్నారని అధికారులను చింతమనేని నిలదీయడం జరిగింది.దీంతో ఆ గొడవ పై నేడు వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి.
( MLA Kothari Abbayya Chaudhary ).చింతమనేని పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గంలో అభివృద్ధికి సంక్షేమానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు.అంతే కాదు నియోజకవర్గంలో 89% అభివృద్ధి సంక్షేమం జరిగిందని వివరించారు.ఇదే సమయంలో ఈ రెండు విషయాల్లో.ఏ సెంటర్ అయినా చెప్పు.
చర్చకు సిద్ధమని చింతమనేని కి కొఠారి సవాల్ విసిరారు.