మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే.అమెరికా పర్యటనలో భాగంగా మోడీ వివిధ దేశాధినేతలతోనూ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు.
రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలపై చర్చించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే ఏళ్లలో భారత్-అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోడీ ట్వీట్ చేశారు.
అయితే మోడీ.అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ని కలిసినప్పుడు అక్కడి అత్యుతన్న అధికారులు కూడా హాజరయ్యారు.కానీ ఆ సమావేశంలో పాల్గొన్న ఒకే ఒక్క భారతీయ అమెరికన్ సుమోనా గుహ.వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు.
గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు.బైడెన్ – హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు.
ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు.
తాజాగా బైడెన్ హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందారు.ఆమెకు స్టేట్ డిపార్ట్‌మెంట్, అమెరికా శ్వేతసౌధం , క్యాపిటల్ హిల్‌లో పనిచేసిన ఇరవై ఏళ్ల అనుభవం కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికకు తోడ్పడింది.
సుమోనా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.ఆమె జార్జ్‌టౌన్, జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు పొందారు.ఆమె 1996లో జాతీయ ఔషధ నియంత్రణ విధాన కార్యాలయంలో ఆర్ధికవేత్తగా తన కెరియర్‌ను ప్రారంభించారు.

ఇక మోడీ, బైడెన్ మధ్య జరిగిన భేటీ సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, వాతావరణానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ, అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్, ఇండో పసిఫిక్ వ్యవహారాల కోఆర్డినేటర్ వంటి అత్యున్నత అమెరికా అధికారుల మధ్య గుహా కూడా వున్నారు.