ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటారు పెద్దలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ ఆయుస్సు ఉంటుందని అందరికి తెలిసిందే , ఈ రోజుల్లో మనిషి సగటున 60 ఏళ్ళు బతకడమే కష్టం , ఎవరైనా 100 సంవత్సరాలు బతికితే గొప్పగా చెప్పుకుంటాం అలాంటింది ఒక వ్యక్తి ఏకంగా 256 సంవత్సరాలు బతికి మనిషి ఆరోగ్య నియమాలు మంచి ఆహారం తీసుకుంటే 100 ఏళ్లకు పైగా బతకావచ్చని నిరూపించాడు.
లీ చింగ్ యున్
చైనా కు చెందిన లీ చింగ్ యున్ 256 సంవత్సరాలు బ్రతికాడు.ఇతను 1677 లో జన్మించడాని మరికొందరు 1733 లో జన్మించడాని చెప్తారు , ఈయన చనిపోయింది మాత్రం మే 6 1933 , ఏ విదంగా చూసుకున్న ఇతని 200 సంవత్సరాలు బతికినట్లు తెలుస్తుంది .1930 వ సం॥ లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక ఆర్టికల్ ను ప్రచురించింది , అదేంటి అంటే 1827వ సంవత్సరంలో చైనా ప్రభుత్వం తమ రికార్డుల ప్రకారం 150వ పుట్టిన రోజు జరుపుకొంటున్న లీ చింగ్ యున్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రకటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.అంతేకాదు 1877లో అతని 200వ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా అందజేయబడ్డాయని తెలిపింది.ఇలా ఈ ద్వీశతకం బతికిన అతని గురించి ప్రపంచానికి తెలిసింది.న్యూయార్క్ టైమ్స్ విలేఖరి అతని గురించిన వివరాలు ఆరాతీస్తే లీ చింగ్ యున్ ఇరుగు పొరుగున ఉన్న వృద్ధులలో చాలా మంది లీ ని తమ తాతలు వారి చిన్నతనం నుంచీ చూశామన్నారని చెప్పారు.

లీ చింగ్ యున్ వృత్తి మరియు జీవన శైలి
లీ చింగ్ యున్ పదేళ్ళ వయసుకే చదవడం వ్రాయడం నేర్చుకొన్నాడు.ఆ వయసు నుండే మూలికా వైద్యుడిగా పని ప్రారంభించాడు.తన గ్రామం చుట్టు పక్కల ఉన్న పర్వత సానువుల నుండి అరుదైన మూలికలు సేకరించి ఔషధాలు తయారు చేసేవాడు.
అతనికి దీర్ఘకాలం జీవించడానికి ఉపకరించే మూలికల గురించి బాగా తెలుసు.దాదాపు 40సం పాటు ఔషధాలుగా వాడే అడవి జిన్ సెంగ్ లింగ్ఝ్, గోజీ హిషోవూ అనే మూలికలను, ఒక రకమైన బియ్యం సారాను మాత్రమే ఆహారంగా తీసుకొన్నాడు.
తన జీవిత కాలంలో మొదటి నూరేళ్ళు మూలికా వైద్యుడిగా తర్వాత మూలికల విక్రేత గా పని చేశాడు.మధ్యలో కొంతకాలం అంటే 1749లో తన 70వ యేట చైనా సైన్యంలో యుద్ధ విద్యల శిక్షకుడిగా కూడా పని చేశాడు.లీ చింగ్ యున్ కి 23 వివాహాల నుండి 200 మందికి పైగా సంతానం ఉన్నారు.
అసలు లీ చింగ్ యున్ 200 సంవత్సరాల పైగా బతకడానికి వెనుక రహస్యం
లీ చింగ్ యున్ మూలికలు సేకరించడానికి మంచూరియా టిబెట్, సియాం లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే వాడు.అక్కడ అతనికి 500 సం॥లుగా జీవిస్తున్న ఒక గురువు కనబడ్డాడని ఆయనే లీ కు ఎక్కువ కాలం జీవించడానికి రహస్యాలు చెప్పాడని అంటారు.ఆయనే లీ కు ఎక్కువ కాలం బతకడానికి ఉపకరించే క్విగొంగ్ వ్యాయమ పద్ధతులు మూలికలు ఆహార విధానాలను బోధించాడని చెప్తారు.
తన చరమాంకంలో లీ అందరితో తన ధీర్ఘాయష్షు రహస్యాన్ని ఇలా చెప్పేవాడు
నేను ఈ ప్రపంచంలో చేయాల్సింది అంతా చేశాను.అతని దీర్ఘాయ్యుస్సుకు అతను నమ్మిన సిద్ధాంతాలు
1.హృదయంలో ప్రశాంతంగా ఉండండి.
2.తాబేలు లా కూర్చొండి.
3.పావురంలా పనిచేయండి.
4.కుక్కలా నిద్రపోండి
లీ చింగ్ యున్ తో పాటు ఇంకా 100 సంవత్సరాలకు పై బడి బతిన కొందరు
ఎమ్మా మొరనో – 117 సంవత్సరాలు
చియో మియకో – 117 సంవత్సరాలు
మసీమ లేయోనోర – 116 సంవత్సరాలు
డోర్రిసిల్ డేర్విస్ – 115 సంవత్సరాలు
టవ కోలో – 115 సంవత్సరాలు
ఇంకా చాలా మంది 100 కు పైగా సంవత్సరాలు జీవించారు , ఈ కాలంలో 100 ఏళ్ళు బతకడం అంటే సాధారణ విషయం కాదు , టెక్నాలజీ ఎంత ఎక్కువగా వస్తే అంత ఆయుస్సు తగ్గుతుంది కారణం ఒంటికి పని భారం తగ్గడం సరైన వ్యాయమం లేకపోవడం , ఆహార పదార్థాల లోపం , కాలుష్యం లాంటివి ఆయుస్సుని తగ్గిస్తుంది.60 ఏళ్ళు దాటితే ఆనారోగ్య సమస్యల తో సతమతమవుటన్నారు.ఏది ఏమైనా మనిషి ఆయుస్సు వందేళ్లు అనేది అపోహ
.