ఏపీలో వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా.
నేలటూరులో జెన్కో మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించారు.కాగా ఈ యూనిట్ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనుంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.జెన్ కో మూడో యూనిట్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామన్నారు.నవంబర్ లోగా మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.