అన్నంత పనీ చేసిన మైనంపల్లి ! ఏ పార్టీలో చేరుతున్నారో.. ?

తనకు టికెట్ దక్కినా , తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో అలక చెందిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli hanumanth Rao ) పార్టీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు.తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని బీఆర్ ఎస్ కు అల్టిమేటం జారీ చేశారు .

 Mayanampalli Who Did So Much Work! Which Party Are You Joining , Mainampalli Han-TeluguStop.com

టికెట్ ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని, పార్టీని వీడెందుకు కూడా సిద్ధమని,  బిజెపి కాంగ్రెస్  నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయి అని మైనంపల్లి ప్రకటించారు.అయితే మైనంపల్లి బెదిరింపులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు.

మైనంపల్లి కుమారుడికి టికెట్ కేటాయించేందుకు ఇష్టపడకపోవడంతో , తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ మైనంపల్లి నిర్ణయం తీసుకున్నారు.అయితే ఏ పార్టీలో చేరబోయేది తాను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Telugu Brs, Congress-Politics

మల్కాజ్ గిరి టికెట్ తనకు కేటాయించినా,  మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ ( Maibampalli rohith )కు కూడా టికెట్ ఇవ్వాలని,  లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మైనంపల్లి ప్రకటించారు .అంతకుముందే మంత్రి హరీష్ రావు( Harish Rao ) పైనా సంచలన విమర్శలు చేశారు.’ ఇక మైనంపల్లి అలక పై బీ ఆర్ ఎస్ కూడా స్పందించింది.టికెట్ కేటాయించాం,  పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేది ఆయన ఇష్టం ‘ అంటూ కేసిఆర్ సైతం వ్యాఖ్యానించారు .ఎమ్మెల్సీ కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.ఇక తన కుమారుడు రోహిత్ కు టికెట్ కేటాయించే అవకాశం కనిపించకపోవడంతో తాజాగా మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎ( BRS )కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Telugu Brs, Congress-Politics

ఇప్పటికే ఆయనకు నుంచి ఆహ్వానాలు అందడం తో ఏ పార్టీలో చేరే కాంగ్రెస్( Congress ) అవకాశం ఉంది అనే దానిపై చర్చ జరుగుతోంది .ఇప్పటి రాజీనామా చేసే విషయం పై ప్రధాన అనుచరులతో సమావేశం నిర్వహించి ,వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube