అన్నంత పనీ చేసిన మైనంపల్లి ! ఏ పార్టీలో చేరుతున్నారో.. ?
TeluguStop.com
తనకు టికెట్ దక్కినా , తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో అలక చెందిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli Hanumanth Rao ) పార్టీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు.
తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని బీఆర్ ఎస్ కు అల్టిమేటం జారీ చేశారు .
టికెట్ ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని, పార్టీని వీడెందుకు కూడా సిద్ధమని, బిజెపి కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయి అని మైనంపల్లి ప్రకటించారు.
అయితే మైనంపల్లి బెదిరింపులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు.మైనంపల్లి కుమారుడికి టికెట్ కేటాయించేందుకు ఇష్టపడకపోవడంతో , తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ మైనంపల్లి నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఏ పార్టీలో చేరబోయేది తాను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు.
"""/" /
మల్కాజ్ గిరి టికెట్ తనకు కేటాయించినా, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ ( Maibampalli Rohith )కు కూడా టికెట్ ఇవ్వాలని, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మైనంపల్లి ప్రకటించారు .
అంతకుముందే మంత్రి హరీష్ రావు( Harish Rao ) పైనా సంచలన విమర్శలు చేశారు.
' ఇక మైనంపల్లి అలక పై బీ ఆర్ ఎస్ కూడా స్పందించింది.
టికెట్ కేటాయించాం, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేది ఆయన ఇష్టం ' అంటూ కేసిఆర్ సైతం వ్యాఖ్యానించారు .
ఎమ్మెల్సీ కవిత కూడా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.ఇక తన కుమారుడు రోహిత్ కు టికెట్ కేటాయించే అవకాశం కనిపించకపోవడంతో తాజాగా మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎ( BRS )కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
"""/" /
ఇప్పటికే ఆయనకు నుంచి ఆహ్వానాలు అందడం తో ఏ పార్టీలో చేరే కాంగ్రెస్( Congress ) అవకాశం ఉంది అనే దానిపై చర్చ జరుగుతోంది .
ఇప్పటి రాజీనామా చేసే విషయం పై ప్రధాన అనుచరులతో సమావేశం నిర్వహించి ,వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారట.
ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?