ఆసుపత్రిలో పెళ్లి...చికిత్స పొందుతున్న యువతి మెడలో తాళి కట్టిన యువకుడు

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయం అయ్యింది.ఈ రోజు లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజకు బుధవారం అస్వస్థతకు గురైంది.

 Marriage In The Hospital...a Young Man Tied A Clapper Around The Neck Of A Youn-TeluguStop.com

వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.

బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది.విషయం పెండ్లి కుమారుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు.

ఓ వైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం పెండ్లి ఏర్పాట్లు చేయడం మళ్ళీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించారు.ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తం కు పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరుకుటుంబ సభ్యలను ఒప్పించాడు.

శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యుల కు విషయము చెప్పారు.పెండ్లి మండపం లేదు,,భజభజంత్రీలు లేవు.

కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు.పెండ్లి పీఠలపై జరుగవలసిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది.

శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు.వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు.

వైద్యులే పెండ్లి పెద్దలుగా మారి బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేసాడు.ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు.

వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు.శైలజ కు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube