యాంకర్ : బాబాయి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు విప్పాలి అని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహే శ్వరరావు డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిలా కొండపల్లి లో అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? లేక డిజిపి ఆఫీసును మూసేసుకున్నారా?….అని ప్రశ్నించారు.టీడీపీ నాయకుడు దొంతు చిన్న గన్నవరం ఎమ్మెల్యే వంశీని ప్రశ్నిస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు ప్రభుత్వ అరాచక పాలనను బీసీలకు ఖండించే హక్కు లేదా?…అని అన్నారు.మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు కనబడడం లేదా? అని తెలిపారు.తప్పుడు కేసులతో బలహీనవర్గాల నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తే మీ పైశాచిక ఆనందం తీరిందా?….అని ఏద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కళ్ళల్లో పైశాచిక ఆనందం చూడడానికి సజ్జల డైరెక్షన్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ విధ్వంసాలతో వీర విహారం చేశారు అని అయన విమర్శించారు……
కంచే చేను మేసిన విధంగా శాంతిభద్రతలు రక్షించాల్సిన పోలీసులే విద్రోహశక్తులకు అండగా నిలిచారు గన్నవరం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు మృత్యువుతో పోరాడుతుంటే ఫ్లెక్సీలు చింపుతూ అరాచకాలకు పాల్పడడం దుర్మార్గం సన్నబయ్యం ఇవ్వలేని సన్నాసి బూతుల మంత్రి బీఫామ్ కోసం బూట్లు నాకుతూ బూతులు తిడుతున్నాడు ఫోర్త్ ఎస్టేట్ మీడియాపై దాడి చేసి మీ అరాచకాలు దాచిపెట్టలేరు పత్రికా మీడియా అధిపతులను పేర్లు పెట్టి తిడుతూ పత్రికలు తగలబెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు పత్రికా స్వేచ్ఛను హరించాలని మీడియాను భయపెట్టాలని అరాచకాలకు తెగబడుతున్నారు కడప ఎంపీ సీటు కోసం ఈ నరబలి జరిగిందా? కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు సిబిఐ చార్జిషీటులో వచ్చింది మరి దీనిపై సజ్జల బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఎందుకు మాట్లాడడం లేదు?కోడి కత్తి కేసు ఏమయ్యింది కేసు విచారణలో కోర్టు ముందుకు ఇంతవరకు ఎందుకు వెళ్లడం లేదు?హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు అబ్బాయి కిల్డ్ బాబాయి అని తేలిపోయింది 40 కోట్ల సుపారి మాట్లాడింది ఎవరు? ఇచ్చింది ఎవరు?….