ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ మాదాపూర్ లోని ఇంటిలో తనిఖీలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ తనిఖీలు ఏ కేసుకు సంబంధించి జరుపుతున్నారన్నది తెలియాల్సి ఉంది.
అయితే అమరావతిలో భూములకు సంబంధించి సీఐడీ కేసులో మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.41 ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఆయన కుమార్తె ఇంటిలో అధికారుల దాడులు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.