సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ వరుస సినిమాలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే.
అయితే రజనీకాంత్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో డిజాస్టర్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి.రజనీకాంత్ సినిమా వల్ల నా కెరీర్ నాశనమైందంటూ ప్రముఖ నటి మనీషా కోయిరాలా( Actress Manisha Koirala ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబా సినిమా( Baba movie ) ఫ్లాప్ కావడం వల్ల తనకు కొత్త సినిమా ఆఫర్లు అయితే రాలేదని ఆమె చెప్పుకొచ్చారు.బొంబాయి సినిమాతో( movie Bombay ) సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మనీషా కోయిరాలా తమిళంలో నేను చేసిన అఖరి పెద్ద మూవీ బాబా అని అన్నారు.
అప్పట్లో ఆ సినిమా భారీ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు అడియాశలయ్యాయని ఆమె తెలిపారు.

బాబా సినిమాతో సౌత్ లో నా కెరీర్ ముగిసిపోతుందని భావించగా చివరకు అదే నిజమైందని ఆమె చెప్పుకొచ్చారు.బాబా సినిమాకు ముందు నేను కొన్ని సినిమాల్లో నటించి ప్రశంసలు పొందానని రీరిలీజ్ లో మాత్రం బాబా సక్సెస్ అయిందని ఆమె కామెంట్లు చేశారు.మొదట్లో బొంబాయి మూవీ చేయకూడదని అనుకున్నానని కెరీర్ తొలినాళ్లలో తల్లి రోల్స్ చేయవద్దని చాలామంది చెప్పారని మనీషా కోయిరాలా చెప్పుకొచ్చారు.

సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం నన్ను తిట్టి మణిరత్నం సినిమాలో ఛాన్స్ వదులుకున్నావంటే నువ్వు వెర్రిదానివి అని చెప్పారని ఆమె పేర్కొన్నారు.ఆయన మాటలు నన్ను కదిలించడంతో బొంబాయి సినిమాలో నటించానని ఆమె అన్నారు.బొంబాయి సినిమాలో నటించడం వల్ల ఇప్పటికీ ఎంతో ఆనందం కలుగుతోందని మనీషా కోయిరాలా తెలిపారు.
ఆమె చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
