బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.
అలాగే నాన్ స్టాప్ పేరిట ఒక ఓటీటీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ముగియడంతో సీజన్ సెవెన్ గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమానికి మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అనంతరం మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా ఏమాత్రం సూట్ అవ్వడం లేదని ఈయన చాలా పక్షపాతంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున నాగార్జున పట్ల విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఏడవ సీజన్ కి నాగార్జున తప్పుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే నాగార్జున స్థానంలో పలువురు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.నాగార్జునకు బదులు బాలకృష్ణ రానా వంటి వారందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారంటూ మరొక వార్త వైరల్ అవుతుంది.ఈ విషయం తెలిసినటువంటి నేటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ముందుగా హీరోగా విష్ణు సక్సెస్ కాలేదు అంతేకాకుండా ఈయనకు యాంకరింగ్ పట్ల ఏమాత్రం అనుభవం లేదు.
ఇతని కన్నా ఈయన సోదరి లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా అద్భుతంగా యాంకరింగ్ చేస్తుందని పలువురు కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం మీరు పొరపాటు పడి ఉంటారు.మంచు విష్ణు బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా అయ్యుండడు కంటెస్టెంట్ గా అయి ఉంటారని వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.