గతేడాది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో( Melbourne ) జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ నిర్వైర్ సింగ్( Punjabi singer Nirvair Singh ) దుర్మరణం పాలయ్యారు.ఆయన ఆకస్మిక మరణం అభిమానులను, పంజాబీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల వ్యక్తి సోమవారం నేరాన్ని అంగీకరించాడు.ఆస్ట్రేలియన్ కౌంటీ కోర్టు ముందు విచారణకు హాజరైన నిందితుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనట్లు తెలిపాడు.
గతేడాది ఆగస్టు 30న మెల్‌బోర్న్ నగరానికి వాయువ్యంగా వున్న బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్‌లో తన టయోటా క్లూగర్‌ను జీపు ఢీకొనడంతో నిర్వైర్ సింగ్ తీవ్రగాయాల పాలయ్యారు.తల, ఛాతీ ఇతర శరీర భాగాల్లో గాయాల కారణంగా ఆయన ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుడు కోరీ కంపోర్ట్( Corey Comport ) డ్రగ్స్ మత్తులో వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు 9 న్యూస్ ఛానెల్ నివేదించింది.

నిర్వైర్ వాహనాన్ని ఢీకొట్టిన సమయంలో అతను జీపును గంటకు 168 కి.మీ వేగంతో నడుపుతున్నాడు.ప్రమాదం జరిగిన సమయంలో వాహన వేగ పరిమితి గంటకు 80 కి.మీ మాత్రమే.దీనిని బట్టి కోరీ.
ఏ స్థాయిలో వాహనాన్ని నడుపుతున్నాడో చెప్పవచ్చు.ప్రమాదానికి 30 నిమిషాల ముందు కంపోర్ట్.
రెండుసార్లు పోలీసులను తప్పించుకున్నాడు.ఈ క్రమంలోనే తోటి వాహనదారులు అతని స్పీడు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు జీహెచ్‌బీ, మెథాంఫెటమైన్, కెటామైన్‌ను సేవించినట్లు పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో తేలింది.

నిర్వైర్ సింగ్ భార్య హార్‌ప్రీత్ కౌర్( Harpreet Kaur ) మాట్లాడుతూ.తన భర్త మరణం జీవితంలో శూన్యాన్ని మిగిల్చిందని.దానిని పూడ్చడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.
ప్రతిక్షణం తన ఆలోచనలు అతని జ్ఞాపకాలతో నిండిపోతున్నాయని హర్‌ప్రీత్ కోర్టుకు తెలిపారు.తన పిల్లల కోసమే తాను జీవిస్తున్నట్లుగా పేర్కొంది.
పిల్లలు కూడా తమ తండ్రిని ఎంతగా కోల్పోయామో కోర్టుకు విన్నవించారు.విచారణ అనంతరం కంపోర్ట్ భావోద్వేగానికి గురవ్వడమే కాకుండా సింగ్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు.
జైలు నుంచి విడుదలయ్యాక మంచి వ్యక్తిగా మారుతానని కంపోర్ట్ పేర్కొన్నాడు.డ్రగ్స్, చెడు ప్రభావాలకు దూరంగా తన సోదరుడితో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తెలిపాడు.
కౌంటీ కోర్ట్ న్యాయమూర్తి స్కాట్ జాన్స్.ఈ కేసు విచారణను డిసెంబర్‌కు వాయిదా వేశారు.
అప్పటి వరకు నిందితుడు పోలీస్ కస్టడీలోనే వుండనున్నాడు.