16 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ హోంగార్డ్..!!

సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.మనిషి కామం తో రగిలి పోతూ వావివరసలు లేకుండా శరీరం ఏది చెబితే అదే అన్నట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉన్నట్లు అనేక సంఘటనలు బయటపడుతున్నాయి.

 Home Guard Mallikarjun Rapes 16 Years Old Girl, Rape Victim,hyderabad,central C-TeluguStop.com

భార్యాభర్తల మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేక అక్రమ సంబంధాలు వంటి వాటివి మాత్రమే కాక వయసు పైబడిన వారు చిన్న పిల్లల పై అఘాయిత్యాలకి పాల్పడటం వంటివి చూస్తున్నాం. 

సరిగ్గా ఇదే రీతిలో  40 సంవత్సరాల హోంగార్డు మల్లికార్జున్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ఉన్న 16 ఏళ్ల బాలికపై  అత్యాచారానికి  పాల్పడినట్లు  ఓ సంఘటన ఇటీవల బయటపడింది.

  మల్లికార్జున  అనే హోంగార్డు  మాయమాటలు చెప్పి 16 సంవత్సరాల కలిగిన ఇంటి పక్కనే ఉన్న బాలికను రెండు నెలల గర్భవతి  చేయటంతో.  బాలిక తల్లిదండ్రులు వెంటనే  విషయం తెలుసుకుని మల్లికార్జున్‌పై తుకారంగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  పోలీసులు హోంగార్డు మల్లికార్జున్‌(40)పై పోక్సో కేసు  నమోదు చేశారు.

  మల్లికార్జున్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్  లో విధులు నిర్వహిస్తున్నట్లు…  సొంత ఊరు అడ్డగుట్ట కి చెందిన వాడు అని వివరాలు బట్టి తెలుస్తోంది.

Telugu Addugutta, Central, Hyderabad, Mallikarujun, Pocso, Telangana, Tukaram Ga.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube