మలేషియా: కొత్త స్టోర్ వెలుపల పోటెత్తిన యాపిల్ లవర్స్‌.. చివరికి..?

యాపిల్ కంపెనీ( Apple ) తన హెడ్ క్వార్టర్స్‌లో గ్లో టైమ్‌ పేరిట ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో కొత్త ఫోన్లు అంటే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ లను ప్రపంచానికి పరిచయం చేశారు.

 Malaysia: Apple Lovers Pouring Outside The New Store Finally , Apple Iphone 16,-TeluguStop.com

ఈ కొత్త ఫోన్లను కొనాలనుకునే వాళ్లు ఈరోజు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.అయితే వీటిని అందరికంటే ముందే సొంతం చేసుకునేందుకు యాపిల్ లవర్స్ ఎగబడుతున్నారు.

ఈ క్రమంలోనే యాపిల్ లవర్స్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.మలేషియా( Malaysia )లోని కౌలాలంపూర్ నగరంలో యాపిల్ కొత్త స్టోర్ దగ్గర ఈ ఊహించని దృశ్యం కనిపించింది.

అదేంటంటే ఇక్కడ చాలా మంది జనాలు కొత్త ఫోన్‌ల కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో పడిగాపులు కాశారు.

కొద్దిరోజులు అయితే ఐఫోన్ కొనడం చాలా సులభం అవుతుంది కానీ త్వరగా కొత్త ఐఫోన్ తీసుకోవాలని, కొత్త యాపిల్ ఫీచర్లు ట్రై చేయాలని యాపిల్ లవర్స్ పనులన్నీ మానుకొని ఇలా పోటెత్తారు.వాళ్లు లైన్‌లో నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కొత్త ఫోన్‌లపై ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో ఈ వీడియోలు చూపిస్తున్నాయి.

ఈ స్టోర్ పేరు “యాపిల్ ది ఎక్స్ఛేంజ్ TRX( Apple The Exchange TRX )”.ఈ వీడియోలో, “స్టోర్ ఉదయం 10 గంటలకు తెరుచుకుంటుంది” అని రాసి ఉంది.

ఈ వీడియోను 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది చూశారు.

ఈ వీడియో మొదట్లో, కెమెరా స్టోర్‌ డోర్ వైపు చూపుతుంది.దుకాణం మొదటి అంతస్తులో ఉంది.వీడియోలో చూపించినట్లు, ఉదయం 10 గంటలకు స్టోర్‌ తెరుచుకోవాల్సి ఉంది.

కానీ, ఆ సమయానికి చాలా ముందేనే జనాలు దుకాణం డోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు లైన్‌లో నిలబడి ఉన్నారు.వీడియో తీస్తున్న వ్యక్తి కెమెరాను పైకి ఎత్తి చూపించగా, చాలా మంది జనాలు గంటల తరబడి లైన్‌లో నిలబడి ఉన్నట్లు తెలుస్తుంది.

యాపిల్ కొత్త స్టోర్‌ తెరిచిన సందర్భంగా “జోమ్ డిస్కవర్” అనే ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు తమ ఫోన్లతో ఫోటోలు తీసుకోవచ్చు, పాటలు పాడే De Fam అనే గ్రూప్ షో చూడవచ్చు, ఐప్యాడ్‌లలో చిత్రాలు గీయడం నేర్చుకోవచ్చు, మ్యాక్ కంప్యూటర్లలో ఇంటర్నెట్ స్టార్ అయిన ఆడమ్ లొబోతో కలిసి కొత్తవి చేయవచ్చు.

ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి.అందుకే చాలా మంది యాపిల్ ఫ్యాన్స్ గంటల తరబడి లైన్‌లో నిలబడి ఉండడానికి కారణం ఇదే కావచ్చు.

ఆ వీడియో కింద చాలా కామెంట్లు వచ్చాయి.ఒకరు ఇలా “నేను అలాంటి లైన్‌లో నిలబడను.

కొత్త ఫోన్ తీసుకోవడానికి నాకు ఒక్కటే ఒక్క కారణం ఉంది, అదే లాంగ్ లైఫ్ బ్యాటరీ వాళ్లు బ్యాటరీని రెండేళ్లు మాత్రమే వచ్చేలా తయారు చేస్తున్నారు.చాలా మంది లైన్‌లో ఉన్న వాళ్లను “పిచ్చివాళ్లు” అని అన్నారు.

కొంతమంది మాత్రం తాము యాపిల్ ఫ్యాన్స్ అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube