టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.
కాగా ఇటీవలే మహేష్ బాబు నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.
తాజాగా ఇటీవలే మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇటీవలే మహేష్ బాబు తన కొత్త సినిమా కోసం ట్రయల్ లుక్ ని విడుదల చేశాడు.దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.
అంతేగాక ఈ ఫోటోని మహేష్ బాబు షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 8 లక్షలకు పైగా లైకులు కామెంట్లు వచ్చాయి.అంతేగాక పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మహేష్ కొత్త లుక్ కి ఫిదా అయ్యారు.
మరికొంతమంది నెటిజనులు ఈ మహేష్ ఫోటో పై స్పందిస్తూ ఈయనకి “వయసు రివర్స్ గేర్ లో ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో వహిస్తున్న “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తున్నట్లు సమాచారం.కాగా ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.