ఐపీఎల్‌కి ఓ రేంజ్‌లో సిద్దమవుతున్న విరాట్ కోహ్లీ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీకి ఒక లెవెల్ లో ప్రిపేర్ అవుతున్నాడు.ఒక పక్క మైదానంలో ప్రాక్టీస్ సెషన్స్‌ లో పాల్గొంటూనే మరో పక్క మైదానం వెలుపల కూడా పూర్తిగా ఆటపైనే ఫోకస్ పెడుతున్నాడు.

 Virat Kohli Preparing For Ipl 2020 In A Range Rcb, Viral Kohil, Instagarm, Vira-TeluguStop.com

ఈ నెల 19 నుంచి జరగనున్న యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీకి కోహ్లీ బాగానే సిద్ధం అయ్యాడు.ఇప్పుడు కోహ్లీ కి సంబంధిచిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

స్వయంగా కోహ్లీయే తన బ్యాట్‌ హ్యాండిల్‌లో కొంత మేర రంపంతో కట్ చేసి… సరిచేసుకుంటున్న వీడియో అది.బ్యాట్‌ ను బ్యాలెన్స్ చేయడంలో తనకు రెండు సెంటీమీటర్లు కూడా ముఖ్యమన్న కోహ్లీ.తన బ్యాట్స్‌ పై జాగ్రత్తగా తీసుకోవడం తనకు ఇష్టమంటూ పోస్ట్ చేశాడు.

ఐపీఎల్ కోసం కోహ్లీ చేస్తున్న కసరత్తు చూసిన నెటిజన్స్ మెచ్చుకోకుండా ఉండలేరు.

జరగబోయే ఐపీఎల్‌ లో కోహ్లీ పరుగుల వర్షం కురిపించడం ఖాయమంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.క్రికెట్ ఫ్యాన్స్ అందరు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ టోర్నీ ఈ నెల 19న యూఏఈ వేదికగా ప్రారంభం అవ్వనుంది.

ఏ మాటకు ఆ మాట ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ కోహ్లీకి ఒక పెద్ద సవాల్ గా మారింది.కానీ కోహ్లీ మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నాడని తెలుస్తుంది.ఈ 13 వ ఐపీఎల్ ఛాంపియన్‌ షిప్‌ ను సొంతం చేసుకోవాలని కోహ్లీ బాగా పట్టుదలగా ఉన్నాడని తెలుస్తుంది.మరి కోహ్లీ పట్టుదల ఎంత వరకు అతనికి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే ఈ నెల 19 న మొదలు అయ్యే ఐపీఎల్ ఛాంపియన్‌ షిప్ కోసం వేచి చుడాలిసిందే మరి.కోహ్లీ అభిమానులు అయితే మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.వాళ్ళ అభిమాన క్రికెటర్ మైదానంలో తీసే పరుగుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube