తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.దీంతో మహిళలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లి రావాల్సి వస్తోంది.
తాజాగా బీడీ కార్మికులుగా పని చేస్తున్న ఓ మహిళపై గ్రామ సేవకుడు సహాయం చేస్తానని చెప్పి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామంలో 35 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మహిళ బీడీ కార్మికులుగా పని చేస్తోంది.
అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కొంతమేర బాగా లేకపోవడంతో నిన్నటి రోజున ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటోంది. అయితే క్రమంలో గ్రామ సేవకుడిగా పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తి వచ్చి ఆమెను పలకరించాడు.
అనంతరం ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అతడు ఆ మహిళను దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లాడు.
![Telugu Mahabubnagar, Telanagana, Helper, Rapedhelper-Telugu Crime News(క్ర Telugu Mahabubnagar, Telanagana, Helper, Rapedhelper-Telugu Crime News(క్ర](https://telugustop.com/wp-content/uploads/2019/12/women-raped-by-village-helper-in-mahabubnagar.jpg)
అయితే ఆరోగ్య కేంద్రంలో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అతడు ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.అంతేగాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.అత్యాచారం అనంతరం ఆ యువకుడు పరారయ్యాడు.
దీంతో ఆ మహిళ తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.