MP Balashowry : జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..!!

ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 Machilipatnam Mp Balashowry Joins Janasena-TeluguStop.com

ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిపోతున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో టికెట్ రాని నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.

ఈ రకంగానే కొద్దిరోజుల క్రితం వైసీపీ పార్టీ( YCP party )కి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( MP Balashowry ) ఆదివారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో బాలశౌరి జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో బాలశౌరి జనసేన తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.2004వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరు సంపాదించుకున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో మచిలీపట్నం ఎంపీగా గెలవడం జరిగింది.అయితే ఈసారి ఎన్నికలలో వైసీపీ నుండి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.

వైసీపీకి రాజీనామా అనంతరం జనసేనలో జాయిన్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.ఈ క్రమంలో ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేన పార్టీ పండుగ కప్పుకోవటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube