బీజేపీలో లొల్లి మళ్ళీ షురూ !

తెలంగాణ ఎన్నికల దగ్గర పడుతున్నవేళ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఆందోళనలో పడేస్తున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.గత కొన్నాళ్లుగా రాష్ట్రం కమలం పార్టీలో అంతర్గత విభేదాలు తార స్థాయిలో కొనసాగుతున్నాయి.

 Lolli Started Again In Bjp , Bjp Party , Tdp , Bandi Sanjay , Eatala Rajend-TeluguStop.com

ముఖ్యంగా బండి సంజయ్( Bandi Sanjay ) అధ్యక్షుడిగా కొనసాగిన టైమ్ లో విభేదాలు, ఆధిపత్య పోరు మీడియాలో గట్టిగానే హైలెట్ అయింది.బండి సంజయ్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇతర పార్టీ నేతలతో ఎలాంటి చర్చలు జరపడం లేదనే ఆరోపణలు వినిపించాయి.

Telugu Bandi Sanjay, Eatala Rajender, Kishan Reddy-Politics

ఇకపోతే ఈటెల రాజేందర్( Eatala Rajender ) కు సరైన ప్రదాన్యం ఇవ్వడం లేదని, ముఖ్యంగా బండి సంజయ్ మరియు ఈటెల మద్య విభేదాలు ఉన్నాయని బీజేపీ సర్కిల్స్ లో గట్టిగా గుసగుసలు వినిపించాయి.ఈ వార్తల కరణంగానేమో గాని పార్టీలో మార్పులు చేపట్టి నేతల మద్య విభేదాలను పోగొట్టే ప్రయత్నం చేసింది అధిష్టానం.అందులో భాగంగానే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఆ బాద్యతలు అప్పగించడం, ఈటెల రాజేందర్ ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ చేయడం వంటివి చేసింది.ఇక గత కొన్నిరోజులుగా సాఫీగా సాగుతుందనుకున్న బీజేపీ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Bandi Sanjay, Eatala Rajender, Kishan Reddy-Politics

ఈటెల రాజేందర్ మరియు కిషన్ రెడ్డి ( Kishan Reddy )మద్య సీట్ల పంపకల విషయంలో విభేదాలు చెలరేగయనే టాక్ వినిపిస్తోంది.వీరిద్దరి మద్య సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కొరవడిందట.అటు అధ్యక్ష పదవికి తను కూడా అర్హుడినే అని ఆ మద్య అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కిన రఘునందన్ ఇంకా అదే దొరణిలోనే ఉన్నారట.దాంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలా అంతర్గత విభేదాలు, కొందరి పార్టీ నేతల్లో అసంతృప్తులు ఆ పార్టీని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube