నిన్న తెల్లవారుజాము నుండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహా శిఖరం అస్తమించింది.కృష్ణ గారి మరణ వార్త వినడం వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు జీర్ణించు కోలేక పోతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.ఈయన లేరు అనే లోటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది.
ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.నిన్న తెల్లవారు జామున 4 గంటల సమయంలో కృష్ణ తుదిశ్వాస విడిచారు.ఈయన మరణంతో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చుసిన వారికీ కూడా దుఃఖం ఆగలేదు.హాస్పిటల్ నుండి కృష్ణ పార్థివ దేహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత మహేష్ బాబు కృష్ణ పార్థివ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకు ముద్దు పెడుతున్న దృశ్యం అందరిని కలిచి వేసింది.
కృష్ణను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ ను చూసి అక్కడ ఉన్న వారు కూడా భావేద్వేగానికి లోనయ్యారు.మరి తాజాగా కృష్ణ పార్ధివదేహాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మహేష్ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫోటో చూసిన వారికీ గుండె బరువెక్కుతుంది.ఈ పిక్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.ఈ ఫోటో చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు ఈ పరిస్థితిలో చూస్తామని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మహేష్ పూర్తి షాక్ లోకి వెళ్ళిపోయాడు.
ఏడాది మొదట్లో అన్నని, ఇటీవలే తల్లిని కోల్పోయి ఒత్తిడిలో ఉన్న మహేష్ కు ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో కోలుకోలేక పోతున్నాడు.దీంతో ఈయన పరిస్థితికి అందరికి మరింత బాధ కలుగుతుంది.
కానీ ఇండస్ట్రీ మొత్తం మహేష్ కు మేమున్నాం అంటూ దైర్యం చెబుతున్నారు.