కువైట్ కొత్త పాలసీ...విద్యార్హత బట్టి వర్క్ పర్మిట్స్...!!!

ప్రపంచ దేశాలు పలు దేశాల ఎన్నారైలను తమ దేశంలోకి ఆహ్వానించే విషయంలో కొన్ని నియమ నిభందనలు ఏర్పాటు చేసుకుని వాటికి అనుగుణంగా వలస వాసుల ఎంట్రీ కి అనుమతులు ఇచ్చేవి.అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు వలసలు వచ్చే వారిపై పలు రకాల ఆంక్షలు విదిస్తున్నాయి.

 Kuwait's New Policy Work Permits Based On Education , Public Authority For Man P-TeluguStop.com

అలాగే తమ దేశంలోకి వచ్చే వలస వాసులకు విద్యార్హతలు బట్టి వర్క్ పర్మిట్ లు ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.కువైట్ ఇప్పుడు ఇలాంటి పాలసీను అమలులోకి తీసుకువస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోన నేపధ్యంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ ను తెరపైకి తీసుకువచ్చింది.ఈ క్రమంలోనే తాజాగా వర్క్ పర్మిట్లు కేవలం విద్యార్హతను బట్టి కేటాయించనున్నట్లుగా ప్రకటించింది.

ఈమేరకు పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటన జారీ చేసింది.తమ దేశంలోకి వచ్చే వలస వాసులకు విద్యార్హతను బట్టి ఉద్యోగాలను 1855 రకాలుగా విభాజించినట్టుగా తెలిపింది.

ఈ 1855 ఉద్యోగాలకు వేరు వేరుగా విద్యార్హతలు నిర్ణయించింది.పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన అధికారిక వెబ్సైటు నందు ఈ విషయాలు వెల్లడించింది.

కువైట్ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా కువైట్ రావాలనుకునే వారు లేదంటే పర్మిట్ రెన్యువల్ చేయించాలనుకునే వారు ఎవరైనా సరే తాము పనిచేసే ఉద్యోగానికి తగ్గట్టుగా విద్యార్హ ఉంటేనే ఈ తాజా నిభందన ప్రకారం ముందుకు వెళ్తుందని తెలుస్తోంది.ఇదిలాఉంటే ఇంజనీర్, డాక్టర్, ఇతరాత్రా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, గణిత శాస్త్రవేత్తలు, ఇలాంటి ఉద్యోగాలు అన్నిటికి డిగ్రీ ను అర్హతగా లేదా దానికి సమానమైన అర్హతలు ఉండాలని సూచించింది.

అలాగే టెక్నీషియన్స్, సుపెర్వైజర్స్, చెఫ్, పెయింటర్, వంటి ఉద్యోగాలకు విద్యార్హతగా కనీసం డిప్లమో ఉండాలని సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube