కరకరలాడే, రుచికరంగా ఉండే కుర్ కురే ప్యాకెట్లు అందరికీ చాలా ఇష్టం.పిల్లలు, పెద్దలు కూడా వీటిని ఖాళీ సమయాల్లో ఇష్టంగా తింటుంటారు.
అయితే ఇటీవల ఓ షాకింగ్ ఘటన జరిగింది.కర్ణాటక రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ తాలూకాలోని హూనూర్ గ్రామంలో కుర్ కురే ప్యాకెట్లలో రూ.500ల నోట్లు వచ్చాయి.కురు కురే ప్యాకెట్లలో రూ.500ల నోట్లు వస్తున్నాయని విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున కురు కురే ప్యాకెట్లు కొన్నారు.దుకాణాల ముందు కురుకురే ప్యాకెట్ల కోసం బారులు తీరారు.
ఒక గ్రామస్థుడు తినడానికి ఒక కంపెనీ నుండి కురుకూరే ప్యాకెట్ కొన్నాడు.కురుకురే తినాలని ప్యాకెట్ తెరిచి చూడగా ప్యాకెట్ లోపల 500 రూపాయల నోటు కనిపించింది.
దీంతో ఆశ్చర్య పడిన ఆ వ్యక్తి మరో ప్యాకెట్ కొన్నాడు.
అప్పుడు కూడా ఆ ప్యాకెట్‌లో రూ.500ల నోటు కనిపించింది.ఇలా ఒకరి నోటి నుంచి మరొకరికి కురుకురే ప్యాకెట్లలో డబ్బులు రావడంతో విషయం గ్రామస్తులు అందరికీ తెలిసింది.
అప్పుడు గ్రామస్తులంతా కురుకూరే కొనేందుకు సిద్ధమయ్యారు.ఈ విధంగా కురుకురే ప్యాకెట్‌లో 500 నోట్లు రావడం షాపు యజమానికి కూడా తెలియదు.
డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పడంతో షాపుల యజమానులు సైతం కురు కురే విక్రయించకుండా ఆపేశారు.తామే ప్యాకెట్లు పంచుతామని చెప్పడంతో గ్రామస్తులు క్యూలలో నిల్చున్నారు.ఈ వార్త హూనూరు గ్రామంలో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల్లో కురుకూరే వ్యాపారం జోరుగా సాగుతుండగా, దుకాణాల్లో కురుకురే ప్యాకెట్లు దొరకడం లేదని స్థానిక దుకాణం యజమాని చెబుతున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.కురుకూరే ప్యాకెట్ లో 500 రూపాయల నోట్లు వచ్చాయని తెలియడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.నిజంగా కుర్ కురే ప్యాకెట్‌లో రూ.500 నోటు దొరికిందా లేక ఇది వ్యాపార వ్యూహమా అని సందేహాలు వస్తున్నాయి.